అందరూ ఇష్టం గా తినే ఎలా చెయ్యాలంటే ..

సీజన్ తో సంబంధం లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టం గా తినే స్నాక్ ఐటం సమోసా..జంతికలు, కారప్పూస లడ్డూలూ .ఇవన్నీ నిల్వ ఉండే స్నాక్స్.వీటినే.. ఇప్పటికీ ఓపికగా ఇంట్లో తయారు చేసేవాళ్ళు ఉన్నారు..మిరపకాయబజ్జీలు పకోడీలని ఇంట్లోనే చేసేవాళ్ళకి ఈ సమోసాలు చెయ్యడం పెద్ద కష్టం కాదు.. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చెయ్యడం చాలా వీజీనే..
వర్షాకాలం లో ఈ సమోసాల టేస్ట్ మరింత పెరుగుతుంది..

MUST READ :హిందూ సంప్రదాయంలో పరమ పవిత్రమయినది – యజ్ఞోపవీతం

అసలు సమోసాలు ఎలా చెయ్యాలంటే ..

ముందుగా ఒక బౌల్ లో ఒక కప్ మైదాపిండి,రెండు టేబుల్ స్పూన్స్ గోధుమపిండి,ఒక స్పూన్ గోధుమ రవ్వ ,కొద్దిగా సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ చపాతీ పిండిలా కలిపి పక్కనపెట్టుకోవాలి..

ఇప్పుడు సమోసా లోపల స్టఫ్ కోసం. రెండు బంగాళాదుంపలని, కొద్దిగా బఠాణీలని కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఒక ఉల్లిపాయని,రెండు పచ్చిమిర్చిని ,కొద్దిగా అల్లం ముక్కని తీసుకుని సన్నగా కట్ చేసిపెట్టుకోవాలి..

స్టవ్ మీద బాండీ పెట్టి, కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక.. అందులో ఉల్లి,పచ్చిమిర్చి,అల్లం ముక్కలని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి.. అప్పుడు అందులో స్వీట్ కార్న్ గింజలు కొన్ని,ఉడికించిన బఠాణీలు వేసి ఒకసారి పెద్ద స్పూన్ తో కలిపి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్,కొంచెం పసుపు,ఒక స్పూన్ ఎర్రకారం,కొద్దిగా ధనియాలపొడి,కొద్దిగా జీలకర్రపొడి వెయ్యాలి..

MUST READ :మెదడు , నరాలు మరియు మానసిక రోగాలను నయం చేసే ఆసుపత్రి

లాస్ట్ లో బంగాళాదుంపలని మెత్తగా చేసి వాటిని కూడా వేస్తూ,కొద్దిగా తరిగినకొత్తీర కూడా వెయాలి.. మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి స్టవ్ మీదనుండి తిసేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఇంతకుముందు కలిపిపెట్టుకున్న మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక రౌండ్ గా ఉండే చపాతీలా చేసుకోవాలి, అ చపాతినీ సగానికి కట్ చెయ్యాలి..

ఒక సగం చపాతీని తీసుకుని. కోన్ లా అంటే త్రికోణ ఆకారం లా చేసుకుని,అందులో ఆలూ కూరని స్టఫ్ చేసి చపాతీ అంచుకి కొద్దిగా నీరు తడి అంటించి మొత్తం కోన్ ని మూసెయ్యాలి ఇలా చేస్తే ఆయిల్ లో వేసినా విడిపోదు సమోసా..
ఇలా ఆలూ మిశ్రమం అంతా అయ్యేదాకా చేసి పక్కనపెట్టుకోవాలి ..

MUST READ :ఇలా చేస్తే మీ కళ్ళద్దాలు దూరంగా పారేస్తారు

ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఈ సమోసాలని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసెయ్యాలి అంతే..

ఇలా చేసిన టేస్టీ సమోసాలని వేడిగా తిన్నా చల్లారాకా తిన్నా కూడా చాలా బావుంటాయి.

MUST READ :చనిపోయినవారి ఆత్మలు తర్వాత కూడా ఉంటాయా?

error: Content is protected !!

x

Related Posts

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
  ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ సినీ న‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మొన్నా న‌డుమ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌లో ఎలా స్ప...
క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?
  తం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో...
శివుడు అంటే ఎవరు?
    ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత ...
powered by RelatedPosts