అందాన్ని మెరుగుపరిచే మూలకాలు వంటగదిలోనే ఉన్నాయి

 

చాలా మంది చర్మంపై కలిగే సాధారణంగా సమస్యలకు, ఉదాహరణకు- నల్లటి వలయాలు, మొటిమలు మరియు మచ్చలని తొలగించటానికి ఖరీదైన ఉత్పత్తులను వాడుంటారు. వీటి వలన ఎక్కువ లాభాలను పొందలేము, కానీ మన వంటగదిలోనే ఉండే సుగంధ ద్రవ్యాల వలన శరీర చర్మం యొక్క సమస్యలు తగ్గటమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. చర్మ సమస్యలను తగ్గించే వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాల గురించి ఇక్కడ తెలుపబడింది.

MUST READ :ఎలాంటి కీళ్ల నొప్పులనైనా త‌గ్గించే అద్భుత‌మైన ఔష‌ధం.!

1
తేనె
సున్నితమైన మరియు మచ్చలు గల చర్మానికి, ఒక చెంచా తేనెను ముఖానికి పూసి, కనీసం 8 నుండి 15 నిమిషాల పాటూ వదిలివేయండి. తేనెలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు, చర్మాన్ని తడిపి, తేమను అందించి, నల్లటి మచ్చలను కలుగచేసే బ్యాక్టీరియాను చంపివేస్తాయి.
2
కీరదోస
కీరదోస లేదా దోసకాయ చర్మానికి ఉపయోగపడే ఔషదం మరియు చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలను, కంటి చుట్టూ ఏర్పడే వాపులను సులభంగా తగ్గిస్తుంది. దోసకాయ ముక్కలు కంటి యొక్క సహజ ప్యాడ్’ల వాలే పని చేస్తాయి. తాజాగా కత్తిరించిన దోసకాయ ముక్కలను కంటిపై ఉంచి, కనీసం 20 నిమిషాల పాటూ ఉంచండి.

MUST READ :దేవుని దీపం ఏ వైపుకి ఉండాలి?

3
గుడ్లు
గుడ్డును ముఖానికి పూయటం వలన బిగుతుగా మరియు నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి, గుడ్డు యొక్క తెల్ల సొనను తీసి, ముఖానికి మాస్క్ వాలే పూయండి. ఒక చిన్న గిన్నెలో గుడ్డు యొక్క తెల్లసొనను తీసుకొని, 10 నిమిషాల పాటూ కలిపి, చేతి వేళ్ళతో ముఖానికి పూయండి. ముఖానికి పూసి 30 నిమిషాల పాటూ వదిలేసి, గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి.

4
బొప్పాయి పండు
బొప్పాయి పండు, అధిక స్థాయిలో విటమిన్ ‘A’ కలిగి ఉండి మరియు చైతన్యరహిత ప్రోటీన్, నిర్జీవ చర్మ కణాలను, చర్మంపై ఉన్న మలినాలను తొలగించే ”పపైన్” అనే ఎంజైమ్’ను కలిగి ఉంటుంది. గ్లాసు బొప్పాయి పండు రసం లేదా బొప్పాయి పండు గుజ్జును ముఖానికి రాయటం వలన ఆద్భుతమైన మార్పులను గమనిస్తారు. బొప్పాయి పండు తోలును ముఖానికి రాసి, 5 నిమిషాల పాటూ ఉంచి, చల్లటి నీటితో కడిగి వేయండి.

5
పసుపు
భారతదేశంలో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం అని చెప్పవచ్చు. ఆహర పదార్థాలకు రంగు మరియు రుచిని కలిగించటమే కాకుండా కాస్మెటిక్’గా కూడా వాడవచ్చు. పసుపును దోసకాయ రసం లేదా నిమ్మరసంలో కలిపి, చర్మానికి పూయండి. దీనిని 15 నిమిషాల పాటూ అలానే వదిలేసి మరియు నీటితో కడిగి వేయండి. కానీ, ఈ పద్దతిని ప్రతి రోజు పాటిస్తూ, కలిగే మార్పులను గమనించండి.

MUST READ :మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు తెలుసుకోవలసిన 25 సత్యాలు!

6
నిమ్మపండు
నిమ్మపండు ముఖంపై కలిగే మొటిమలను తగ్గిస్తుంది. దీనిని ముఖంపై ప్యాక్ లేదా నేరుగా పూసి, రంగు మారే వరకు వేచి ఉండండి. నిమ్మపండు సహజంగా శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది.

MUST READ :సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు – వాస్తవ పరిస్థితులు – 2

7
దాల్చీన చెక్క
దాల్చిన చెక్క, పొడి చర్మాన్ని, మొటిమలను మరియు నిర్జీవతత్వాన్ని పోగొడుతుంది. ఇందులో, కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్కను కలిపి ముఖానికి వాడండి. దాల్చిన చెక్క చాలా గాడత గల సుగంధ ద్రవ్యం. కావున, కొద్ది మొత్తంలో మాత్రమె కలిపి ముఖానికి వాడండి.

8
కాఫీ
రోజును కాఫీతో ప్రారంభినటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు అవునా! కాఫీ, ఎక్సోఫోలేట్ గుణాలను కలిగి ఉండటం వలన అలసిన మరియు నిర్జీవ కణాలను తొలగిస్తుంది. మీకిష్టమైన ఫేస్ వాష్’లో కొద్ది మొత్తంలో కాఫీ పొడిని కలిపి రోజు వాడటం వలన మంది ఫలితాలను పొందుతారు.

MUST READ :కార్తీక మాస వ్రతం ప్రాముఖ్యత

MUST READ :పెళ్ళిలో బుగ్గన చుక్క పెట్టటంలో అర్ధం ఏమిటి.?

error: Content is protected !!

x

Related Posts

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
  ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ సినీ న‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మొన్నా న‌డుమ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌లో ఎలా స్ప...
క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?
  తం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో...
శివుడు అంటే ఎవరు?
    ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత ...
powered by RelatedPosts