అందాలబొమ్మ శ్రీదేవి.. గురించి కొన్ని షాకింగ్ విషయాలు

  •  
  •  
  •  

అసలు భూలోకం.. ఇలాంటి సిరి చూసి ఉంటదా ..

ఏం రంగూ..ఏం పొడుగూ ఏం కళ్ళు..బ్రహ్మదేవుడు నాలుగురోజులు ఆలోచించి వారం రోజులు కష్టపడి ప్రత్యేకం గా చాలా శ్రద్ధపెట్టి సృష్టించించి భూలోకం మీద వదిలిన అందాలబొమ్మ శ్రీదేవి..

నాలుగేళ్ళకే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బోల్డంత ఎక్స్పీరియన్స్ ని సొంతం చేసుకున్న శ్రీదేవి ,చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయినా పెద్దవాళ్ళతో పోటీపడి నటించింది..అందుకే పెద్దయితే ఇండస్త్రీని ఏలేస్తుందనిపించుకుంది .నిరూపించింది కూడా..
1963 లో పుట్టిన శ్రీదేవి ..తప్పక పుట్టిన సంవత్సరం మెన్షన్ చేస్తున్నా.. శ్రీదేవి విషయం లో శుద్ధ అనవసరం..ఎందుకంటే శ్రీదేవిని చూస్తే వయసెక్కడ తెలుస్తుంది ?..

MUST READ :ప్రభుత్వోద్యోగులకు ఈజీగా పాస్ పోర్టు

1976 లో బాలచందర్ చిత్రం “మూండ్రు ముదచ్చు” లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకుంది శ్రీదేవి.

1975-85 తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయిక గా వెలిగింది శ్రీదేవి మాత్రమే…

ఇదే టైం లో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయకి గా కొనసాగింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. శ్రీదేవి నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు.

ఎన్. టి. రామా రావు గారితో కొడవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి .. ఎ. నాగేశ్వర రావు గారితో.. ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక ,శ్రీరంగనీతులు. సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి కంచు కాగడ కలవారి సంసారం , కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు ..ఇలా చాలా సినిమాల్లో సినిమాల్లో నటించింది శ్రీదేవి.

MUST READ :కాలస‌ర్ప దోషం అంటే ఏమిటి? ఇది ఉంటే అంతా చెడే జ‌రుగుతుందా?

కమల్ హాసన్ తరువాత, శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాలలో నటించడం జరిగింది…. తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగం లో అడుగుపెట్టిన ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు, ఆల్మోస్ట్ ఆ సినిమాలన్నీ తెలుగు సినిమాలకి రీమేక్ గా తీసినవే.. ముఖ్యంగా కె. రాఘవేంద్ర రావు గారు మరియు కె. బాపయ్య గారు దర్శకత్వం వహించిన సినిమాలే..

తెలుగులో శోభన్ బాబు తో చేసిన దేవత ..కార్తీకదీపం చాలామంచిపేరు తెచ్చాయి శ్రీదేవికి..ఇక చంద్రమోహన్ తో చేసిన పదహారేళ్ళ వయసు సినిమా అయితే ఒక ప్రభంజనం.. ఆరోజుల్లో చాలామంది శ్రీదేవిలాంటి అందమైన అమ్మాయి భార్య అయితే చాలని కోరుకునేవారు..ఆరోజుల్లో ఏంటీ ఈరోజుల్లో కూడా శ్రీదేవిలాంటి అందమైన అమ్మాయి గాళ్ ఫ్రెండో భార్యో అయితే పండగే అనుకునేవాళ్ళు బోల్డుమంది….

MUST READ :ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం

వసంతకోకిల తో కన్నీళ్ళు పెట్టించిన శ్రీదేవి రాంగోపాల్ వర్మ తీసిన క్షణక్షణం లో అమాయక పాత్రతో నవ్వించింది..
శ్రీదేవి వల్ల చాలాసినిమాలు హిట్ అయ్యాయనేది నిజం..శ్రీదేవీ అందం సగం, వాయిస్ సగం కలిసి మొత్తానికి ఆడియన్స్ ని కట్టిపడేసాయి..

శ్రీదేవి ఎంత అందం గా ఉన్నా నంబర్ వన్ హీరోయిన్ గా తన హవా నడుస్తున్నా కూడా ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి..

MUST READ :ప్రపంచంలో అతి ఎక్కువమందికి ఉచితంగా నేత్రవైద్యం అందిస్తున్న సంస్థ. శంకర ఐ ఫౌండేషన్‌

చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చూసి నిజం గా అప్సరస అంటే ఇలానే ఉంటుంది అనిపించేలా చేసిన శ్రీదేవి ఆఖరిపోరాటం లో నాగార్జునతో కలిసి నటించి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించింది..
కమల్ హాసన్ తో చేసిన ఆకలిరాజ్యం లో కమల్ తో పోటీపడినటించిన శ్రీదేవి రజనీకాత్ తో కొన్ని సినిమాల్లో నటించినా తమిళ్ లో ఎక్కువసినిమాలు చేసింది కమల్ తోనే..

చాలా సంవత్సరాలు గేప్ తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో కనిపించిన శ్రీదేవి నటనలో ఏమాత్రం మార్పు రాలేదు..
2013 లో పద్మశ్రీ అవార్డ్ తో భారతప్రభుత్వం శ్రీదేవిని సత్కరించింది..ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నీ సొంతం చేసుకున్న శ్రీదేవి తన వీరాభిమాని రాం గోపాల్ వర్మ తీసిన క్షణక్షణం సినిమాకి గాను ఉత్తమనటి గా ఫిల్మ్ ఫేర్,అప్పటింకా విడిపోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డ్.. రెండూ తీసుకున్న శ్రీదేవి చాలామందికి కలలదేవత..

ఎంతమంది హీరోయిన్స్ వచ్చి వెళ్తున్నా శ్రీదేవి ని మాత్రం ఎవరూ మర్చిపోలేరు ఎందుకంటే గ్లామర్ మాత్రమే కాదు నటన కూడా తెలిసిన శ్రీదేవి సినిమా ఇండస్ట్రీకీ,సినిమా అభిమానులకి ఒక వరం..

MUST READ :సరైన సమయం లో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే వాళ్ళని ఇకకాపాడుదాం రండి


  •  
  •  
  •  
error: Content is protected !!

x

Related Posts

రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం?
ri Guru Raghavendra Swamy Miracles || రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం? MUST READ:అవతారం అనగా-నేమి-?దాని-ప్రయోజనం ఏంటి ?చాగంటి గారి మాటలలో....
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....*
    *నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....* 🕉ఓం నమో వెంకటేశాయ🕉 *‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో డాక్యు...
వీళ్లి ద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా?
  Actor Raghuvaran With His Wife Rohini | వీళ్లిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా? | MUST READ:ఇన్ని నదులు వుండగా గంగ నది కే ఎందుకు అంత...
powered by RelatedPosts