ఈస్టెప్స్ ఫాలో అయితే చాలు… మీ అకౌంట్స్ హ్యాకర్ల భారిన పడకుండా సేఫ్ గా ఉంటాయి.

  •  
  •  
  •  

 

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి బద్ధకం పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని చులకనగా చూస్తున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు లేదా సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న సమయంలో వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఏమాత్రం భయం లేకుండా ఇతర వెబ్ సైట్ల తో పంచుకుంటున్నారు. ఇది ఏ మాత్రం సురక్షితం?

అసలు పాస్ వర్డ్స్ అనేవి ఎందుకు ఉన్నాయి? మన అకౌంట్స్ ను వేరొకరి నుండి సురక్షితంగా ఉంచడానికే కదా..? మరి ఇప్పుడు ఆ పాస్ వర్డ్స్ కే సరైన బద్రత లేకుండా పోయింది. బ్యాంక్ అకౌంట్స్ నుండి ఆన్ లైన్ అకౌంట్స్ వరకు అన్నిటికి ఈ పాస్ వర్డ్ అనేది ఉంటుంది. కాని ఈరోజుల్లో హ్యాకర్ల దారుణాలు చాలా పెరిగిపోయాయి.

MUST READ :శ్రీ కనకమహాలక్ష్మిఅమ్మవారు విశాఖపట్నం

అప్పట్లో ఫేస్ బుక్ సి.ఈ.ఓ మార్క్ జుకర్-బర్గ్ యొక్క ట్విట్టర్ (Twitter) మరియు పిన్ట్రేస్ట్ (Pintrest) అకౌంట్స్ ను ఓ హ్యాకింగ్ గ్రూప్ వారు హ్యాక్ చేశారు… మొన్నీమధ్య అదే గ్రూప్ కు చెందిన వారు గూగుల్ సి.ఈ.ఓ సుందర్ పిచై క్వోరా (Quora) అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఇంటర్నెట్ దిగ్గజాలైన వారి అకౌంట్స్ కే బద్రత లేకుండా పోయింది. ఇక మన అకౌంట్స్ ఎంత చెప్పండి..!! అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది.

కొన్ని ఈజీ స్టెప్స్ ఫాలో అయితే చాలు… మీ అకౌంట్స్ హ్యాకర్ల భారిన పడకుండా సేఫ్ గా ఉంటాయి.

MUST READ :వివాహం ఆలస్యం అవుతున్న వారు చేయవలసిన వ్రతం

* ఎక్కువ శాతం మంది -password, 123456, abcdef లేదా abc123- అని చాలా సింపుల్ గా వారి పాస్ వర్డ్స్ ను సెట్ చేసుకుంటారు. అది చాల పొరపాటు. అసలు ఎవరు గెస్ చేయని పాస్ వర్డ్ ను పెట్టుకోవాలి. ఉదాహరణకు మీ అభిమాన నటుడి పాపులర్ డైలాగ్ లోని పదాల మొదటి అక్షరాలను ట్రై చేయండి. ఇందులో అక్కడక్కడ నంబర్స్ మరియు సింబల్స్ కూడా కలపండి. దీన్ని హ్యాక్ చేయడం ఎవరి తరం కాదు!!

* మీ ఇంటికి, ఆఫీస్ లోని లాకర్ కి, బండికి ఎలాగైతే వేరువేరు కీస్ వాడుతారో… అలానే ప్రతీ ఒక్క అకౌంట్ కు వేరే పాస్ వర్డ్స్ ను వాడండి. లేదా -వన్ టైం పాస్ వర్డ్- (OTP) అనే ఆప్షన్ ఎల్లప్పుడూ అడిగేలా మీ అకౌంట్లో సెట్టింగ్స్ మార్చుకోండి. దీని వల్ల మీ పాస్ వర్డ్ తో పాటు.. మీ మొబైల్ కు వచ్చిన OTP కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. హ్యాకర్ల దగ్గర మీ ఫోన్ ఉండదు కాబట్టి.. మీ అకౌంట్ సురక్షితం!!

MUST READ :గురుగ్రహ దోష నివారణకుపరిష్కార మార్గాలు

* మీ బ్యాంక్ పాస్ వర్డ్స్, ఆన్లైన్ అకౌంట్ పాస్ వర్డ్స్…. ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే ఎన్నో పాస్ వర్డ్స్ ఉంటాయి. ఇవన్ని గుర్తుపెట్టుకోవడం కొంచం కష్టమే. అందుకే పాస్ వర్డ్ మేనేజర్ అనే అప్లికేషను ను వాడడం చాలా మంచిది. దీంట్లో మీ పాస్ వర్డ్స్ అన్నిటిని బద్రపరుచుకోవచ్చు. అన్నిటికి కలిపి ఒక మాస్టర్ పాస్ వర్డ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. కాని నమ్మసక్యమైన పాస్ వర్డ్ మేనేజర్ ను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించండి.

* అప్పుడప్పుడు పాస్ వర్డ్స్ మరచిపోతు ఉంటాము. ఇలాంటి సమయాల్లో రీసెట్ పాస్ వర్డ్ ఆప్షన్ ను ఎంచుకోక తప్పదు. అప్పుడు మీ కొత్త పాస్ వర్డ్ ను రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కు పంపిస్తారు. అందుకే అకౌంట్ క్రియేట్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన రీకవరి ఇమెయిల్ అడ్రస్ ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండేటట్టు చూసుకోవాలి.

MUST READ :• మకర సంక్రాంతి కి నిర్వచనం ఏమిటి?!

* పాస్ వర్డ్స్ రీసెట్ చేసుకోడానికి SMS ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. రికవరీ ఈమెయిల్ అడ్రస్ కన్నా ఇది చాలా సురక్షితం… ఎందుకంటే మీ ఫోన్ ఎల్లప్పుడూ మీ వద్దే ఉంటుంది కాబట్టి.

* ఏదైనా ఆన్ లైన్ వెబ్ సైట్ లో షాపింగ్ చేసేటప్పుడు కుదిరినంత వరకు లాగ్ ఇన్ అవ్వకుండా గెస్ట్ గానే షాపింగ్ చేయండి. దీంతో మీ పర్సనల్ డీటెయిల్స్ ఆ వెబ్ సైట్ సర్వర్ లో స్టోర్ అవ్వకుండా ఉంటాయి.

* సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఫోటోలు, వీడియోలు, స్టేటస్ అప్డేట్స్ లాంటివి ఎన్నో పెడుతూ ఉంటాం. వీటిని ఎవరెవరో చూడగలరో మీరే నిర్భంధించాలి. ప్రైవసీ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ ఉంటుంది.

ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.. మీ అకౌంట్స్ ను హ్యాక్ చేయడం ఎవరి వల్లా కాదు!! 

MUST READ :సంక్రాంతి రోజున పితృదేవతలకి తర్పణాలు ఎందుకు వదలాలి..?


  •  
  •  
  •  
error: Content is protected !!

x

Related Posts

రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం?
ri Guru Raghavendra Swamy Miracles || రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం? MUST READ:అవతారం అనగా-నేమి-?దాని-ప్రయోజనం ఏంటి ?చాగంటి గారి మాటలలో....
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....*
    *నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....* 🕉ఓం నమో వెంకటేశాయ🕉 *‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో డాక్యు...
వీళ్లి ద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా?
  Actor Raghuvaran With His Wife Rohini | వీళ్లిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా? | MUST READ:ఇన్ని నదులు వుండగా గంగ నది కే ఎందుకు అంత...
powered by RelatedPosts