కలబంద తో….కల్తీలేని సబ్బు ను మీ ఇంట్లోనే తయారు చేసుకోవొచ్చు

కలబంద తో….కల్తీలేని సబ్బు  ను మీ ఇంట్లోనే తయారు చేసుకోవొచ్చు. ఇదిగో ఇలా.!

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కనీసం ఓ నాలుగు సార్లైన సబ్బును ఉపయోగిస్తూనే ఉంటాం. ఒక్కొకరిదీ ఒక్కో బ్రాండ్. కొంతమంది సీజన్ ను బట్టి, మరికొంత మంది అందమైన ప్యాకింగ్ ను బట్టి…ఇంకొంత మంది టివిలో వచ్చే యాడ్స్ ను బట్టి సబ్బులను కొంటుంటారు. అయితే అంతగా ఉపయోగం ఉన్న సబ్బులను ఇంట్లోనే తయారు చేసుకుంటే…? ఎన్నో రసాయనాల మిళితం అయిన సబ్బులకు దూరంగా ఉండొచ్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బు కు డబ్బు ఆదా. కాస్మొటిక్ రారాజు అయిన కలబంద ను ఉపయోగించి సబ్బు ఎలా తయారు చేయాలో ఓ సారి పరిశీలిద్దాం.

MUST READ :వివాహానికి వచ్చి ఆశీర్వదించే దేవతలు ఎవరో మీకు తెలుసా?

కలబంద సబ్బు తయారీకి కావాల్సిన పదార్థాలు:
దాదాపు 110 గ్రాముల కలబంద గుజ్జు
110 మిల్లీలీటర్ల కాస్టిక్ సోడా (సూపర్ మార్కెట్లో లభించును)
750 మిల్లి లీటర్ల ఆలివ్ ఆయిల్
250 మిల్లి లీటర్ల నీరు
ఎస్సేన్శియాల్ ఆయిల్
aloe-vera-soap1

MUST READ :5 రకాల ఆరోగ్య పరిస్థితులను నయం చేసే జామాకులు

తయారీ విధానం:
సబ్బు తయారే చేసే ముందు గ్లౌస్ వేస్కోండి.
నీటిని వేడి చేసి, ప్లాస్టిక్ డబ్బాలోకి పోయండి.
దీనికి కాస్టిక్ సోడా కలిపి బాగా కలపండి.ఈ మిశ్రమం చల్లబడేవరకు గాలివీచే ప్రాంతంలో ఉంచండి.
మిశ్రమం చల్లారే లోపు, చెంచా లేదా చాకు సహాయంతో కలబంద ఆకుల నుండి తాజా గుజ్జును వేరు చేయండి. ఈ గుజ్జును జెల్ రూపంలో మారే వరకు గ్రైండ్ చేయండి.
MUST READ :ఒకప్పుడు పేపర్లు అమ్మింది – ఇప్పుడు IIT గ్రాడ్యుయేట్ అయింది

ఆలివ్ ఆయిల్ ను కొద్దిసేపు వేడిచేయండి. కాస్టిక్ సోడా కలిపిన నీటికి ఆలివ్ ఆయిల్ ను కలిపి బాగా కలపండి.మిశ్రమం మందంగా మారే వరకు కలుపుతూనే ఉండండి.తరువాత దీనికి కలబంద గుజ్జును కలిపి, బాగా కలపండి.
సువాసన కోసం లావెండర్ ఆయిల్, రోజ్ వాటర్ కలపండి .
ఇలా సిద్దం అయిన మిశ్రమాన్ని అచ్చు ఉన్న లోటు తక్కువగా ఉన్న మూసాలో పోసి ఉంచి, ఒక రోజు వరకు ఆలాగే వదిలివేయండి.
మరుసటి రోజు, ఘన రూపంలోకి మారిన కలబంద సబ్బును ముక్కలుగా కత్తిరించవచ్చు.
ఈ ముక్కలను కనీసం 15 నుండి 30 రోజుల వరకి అలాగే ఉంచటం వలన గట్టి పడతాయి.

MUST READ :ఎయిర్ సైకిల్… ఒడిశా బాలిక చేసిన అద్భుతం..!

MUST READ :మొదటగా పరమవీర చక్ర అవార్డ్ ను పొందిన మేజర్ ఇతను. Real Story.


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts