గురుగ్రహ దోష నివారణకుపరిష్కార మార్గాలు

 

మనకు ఉన్నటువంటి నవగ్రహములలో గురుగ్రహం ఐదవ గ్రహము. జాతక రీత్యా గురుగ్రహం బలహీనంగా ఉన్నవారూ లేదా గురుగ్రహ దోషంతో బాధపడుతున్నవారు, ఏ యే పనులు చేయడంవల్ల గురుగ్రహ దోషం నుంచి ఉపశాంతి పొందుతారో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఉద్యోగము నందు అభివృద్ధి లేకపోవడము, చేసే పనులయందు పరిష్కారములు త్వరగా రాకపోవడము, ఉన్నత పదవులను స్వీకరించడానికి అవరోధములు ఏర్పడటము, కృషియందు అభివృద్ధి లేకపోవడము, మాట విలివ తగ్గడము, సంతానంలో చికాకులు మొదలైనవి అన్నీ కూడా గురుగ్రహ దోషము వల్ల ఏర్పడే సమస్యలు కావునా…

MUST READ :మకర సంక్రాంతి కి నిర్వచనం ఏమిటి?!

 

  1. గురుగ్రహ దోషనివారణ కొరకు శనగపిండితో చేసిన లడ్డూలను కానీ, బూందీ మిఠాయిని కానీ, బెల్లంపానకం ను సాయినాధుని/దత్తాత్రేయ స్వామి వారి ఆలయం వద్ద పంచడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగును.
  2. అంతేకాక, దత్తవజ్ర కవచాన్ని 16రోజులు పారాయణ చేయడంవల్ల కూడా మంచి ఫలితమును పొందవచ్చును.  
  3. ప్రతీ గురువారం 6-7గంటల మధ్య మీ ఇంటివద్ద లేదా పరిసర ప్రాంతాలలో ఉన్న సాయి/దత్తాత్రేయ స్వామి ఆలయమునకు వెళ్లి 160 ప్రదక్షినలను చేసినా మంచి ఫలితమును కలుగును.

MUST READ :సంక్రాంతి రోజున పితృదేవతలకి తర్పణాలు ఎందుకు వదలాలి..?

  1. బ్రాహ్మణోత్తములచే గురుగ్రహ జపం చేయించుకొని తత్తతు తర్పణాన్ని, దానాన్ని చేసినా లేక  5సేరుల నాబెట్టిన శనగలను దానం ఇవ్వడం వల్ల కానీ, ప్రసాదంగా పంచడం వల్ల కూడా గురుగ్రహం అనుగ్రహం కలిగి ఆటంకాలు తొలగును.
  2. ఇవేమీ చేయలేని వారు కనీసం గురుగ్రహ స్తోత్రమును 11 సార్లు ప్రతినిత్యం పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితములను పొందవచ్చును.

MUST READ :భోగి పండ్లు ప్రాముఖ్యత ఏమిటి?

గురుగ్రహ స్తోత్రము:
దేవానాంచ బుషీనాంచ గురుం కాంచన సన్నిభం|
భుధ్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం||

MUST READ :వేప నూనెతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts