గొడుగు పుట్టుకకి కారణం వెనుక వున్న అంతరార్ధం

1. కథ

తీవ్రమైన వేసవి కాలం లో ఒక నాడు జమదగ్ని మహర్షి ఉదయాన్నే ఆశ్రమం బయటకు వచ్చి యజ్ఞానికి కావలసిన సమిధలను అమర్చుకుంటూ ఉన్నాడు. ఉదయం కొంత గడవగానే ఎండ తీవ్రత పెరిగింది. మహర్షి చెమటలతో తడిసిపోయాడు.  నాలుక ఎండిపోయింది. ఎండ వేడిమికి తన పనిమీద ఏకాగ్రత కోల్పోతున్నాడు. దాంతో ఆయనకు సూర్య భగవానునిపై కోపం వచ్చింది. సూర్య భగవానుని వెళ్లిపొమ్మని ఆదేశించాడు. కానీ కాల ధర్మాన్ని తప్పని సూర్యుడు ఆయన మాటలను వినలేదు. దాంతో జమదగ్ని మహర్షి మరింత కోపోద్రిక్తుడైనాడు.

2. జమదగ్ని సూర్యుని ఏమి చేశాడు?

తన మాట వినని సోర్యునిపై జమదగ్ని మహర్షి కోపగించి విల్లంబులను ఎక్కుపెట్టి స్సోర్యుని వైపుకు సంధించాడు. చేతులోని బాణాలు అయిపోగానే తన భార్య రేణుకను పిలిచి, కుటీరం నుంచీ బాణాలను తీసుకు రమ్మన్నాడు. రేణుకా తెచ్చి ఇచ్చిన బాణాలతో జమదగ్ని మహర్షి సూర్యునిపై అరివీర భయంకరంగా దాడి కేసాడు.  మహర్షి బాణాలకు తట్టుకోలేని సూర్యుడు ఎండ తీవ్రతను పెంచాడు.  కనీసం అలాగయినా మహర్షి కుటీరం లోకి వెళ్తాడని.

3. జమదగ్ని మహర్షి బాణాలు సూర్యునిపై ప్రభావం చూపించాయా?

మహర్షి బాణాలకు తట్టుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు సూర్యుడు. జమదగ్ని తన బాణాలను తదేకంగా సూర్యునిపై కురిపిస్తున్నాడు. ఆ ఎండ వేడిమికి తట్టుకోలేక రేణుకాదేవి మూర్చిల్లింది. మహర్షి కోపం మరింత పెరిగింది. ఇది చూసిన సూర్య భగవానుడు వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించాడు.

  MUST READ :కుజ దోష, సంతాన దోష, కాలసర్పదోష, రోగ నివారణ క్షేత్రం “హేమాచల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం”

4. సూర్యుని ఆలోచన

సూర్యుడు వెంటనే బ్రాహ్మణ  వేశాన్ని ధరించి జమదగ్ని మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించాడు. ఆయనను చూసి గాలిలో బాణాలు వేస్తున్నారెందుకు? అని అడిగాడు. అప్పుడు మహర్షి ‘ గాలిలో కాదు సూర్యుని శిక్షిస్తున్నాను అన్నాడు. అప్పుడు బ్రాహ్మణ వేషం లోని సూర్యుడు స్వామీ అంతా దూరం మీ బాణాలు ఎలా వెళ్తాయి అనగానే మధ్యాహ్న సమయానికి సూర్యుడు ఆకాశం లో మధ్యభాగానికి చేరుకుంటాడు అప్పుడు తప్పకుండా నా బాణాలు అతని దాకా వెళతాయి. అన్నాడు. ఆ మాటలకు ఖంగుతిన్నా సూర్యుడు. ‘ స్వామీ నేనే సూర్యుడిని.’ నేను కేవలం నా ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తున్నాను. నన్ను శిక్షించడం తమ వంటి మహర్షులకి తగదు. అని ప్రాధేయపడ్డాడు.

5. జమదగ్ని మహర్షి ఎలా శాంతించాడు?

తన కర్తవ్య పాలన చేస్తున్న సూర్యుడిని శిక్షించడం తాను చేయ వలసిన పనికాదని అర్థం చేసుకున్న జమదగ్ని శాంతించాడు. సూర్య భగవానుడు తన ఎండ వేడిమి నుండీ మహర్షిని కాపాడటానికి ఒక పెద్ద గొడుగునూ, పాదరక్షలనూ సమర్పించాడు. అదే మొట్ట మొదటి గొడుగని పెద్దలు చెబుతారు.

MUST READ :” చండీ హోమం ” అంటే ఏమిటి .? చండీ హోమం విశిష్టత ఏమిటి .?

error: Content is protected !!

x

Related Posts

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
  ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ సినీ న‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మొన్నా న‌డుమ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌లో ఎలా స్ప...
క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?
  తం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో...
శివుడు అంటే ఎవరు?
    ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత ...
powered by RelatedPosts