గ్యాస్ వినియోగదారులు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం

 

గ్యాస్ వల్ల ఏదైనా దురదృష్ట సంఘటన జరిగితే బీమా వస్తుందా ? వస్తే ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి ? గ్యాస్ వినియోగదారులు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం

MUST READ :   గుండెపోటును ఒక్క నిమిషంలో ఇలా ఆపవచ్చు

ఎల్‌పీజీ వినియోగదారులందరికీ బీమా రక్షణ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ)కు సంబంధించి దురదృష్టకర ఘటన జరిగితే లిఖితపూర్వకంగా గ్యాస్‌ డీలర్‌‌కు తెలియచేయాలి. డీలర్‌ విషయాన్ని వెంటనే సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి, బీమా కంపెనీకి తెలియచేస్తారు. ప్రమాదం కారణంగా తలెత్తే బీమా క్లయిమ్‌లకు చేయా ల్సిన అన్ని పనులను పూర్తి చేయడంలో సహకారం అందిస్తామని ఆయిల్‌ కార్పొరేషన్లు ప్రకటించాయి. 

పబ్లిక్‌ లయబిలిటీ బీమా పాలసీ..

 

మరణం సంభవించిన పక్షంలో ప్రతి ఘటన, ప్రతి వ్యక్తికి రూ.6లక్షల వ్యక్తిగత బీమా రక్షణ.

 

ప్రతి ఘటనకు రూ.30 లక్షల వరకు వైద్య ఖర్చులు, ప్రతి వ్యక్తికి అత్య దికంగా రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.25 వేల వరకు తక్షణ సాయం.

 

అధీకృత డీలర్‌ రిజిస్టరు ప్రాంగణంలో అత్యధికంగా రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తారు. దీనికి కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.

MUST READ :   ఈ మొక్కలను పెరట్లో పెంచితే … దోమలు మీ ఇంట్లోకి అస్సలు రావు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..

 

వంటగదిలో రిఫ్రిజిరేటర్‌, వెలుగుతున్న దీపం ఉంచరాదు.

 

వంటగ్యాస్‌ సిలిండర్‌ను ఎప్పుడూ నిటారుగానే ఉంచాలి. గ్యాస్‌ స్టౌను సిలిండర్‌ కన్నా ఎత్తులోనే ఉంచాలి.

 

బాగా గాలి తగిలే ప్రదేశంలో గ్యాస్‌ స్టౌ ఉంచరాదు. గ్యాస్‌లైట్‌ వెలిగించిన తరువాత స్టౌ ఆన్ చేయాలి.

 

రెగ్యులేటర్‌ను రాత్రి నిద్రపోయే ముందు ఆఫ్‌ చేయాలి.

 

ఐఎస్‌ఐ మార్కు కలిగిన రబ్బరు ట్యూ బ్‌లను ఐదేళ్లకొకసారి మార్చాలి.

 

రబ్బరు ట్యూబ్‌ను గ్యాస్‌ స్టౌ, రెగ్యులేటర్‌కు బిగించేటప్పుడు సబ్బుగాని, నూనె గాని వాడరాదు. నీరు మాత్రమే వినియోగించాలి.

MUST READ :   హిందూ సంప్రదాయం లో వివాహ పద్ధతులు ఎన్ని?

గ్యాస్‌ లీకవుతున్నట్లు గుర్తిస్తే ..
గాలి కోసం అన్ని కిటికీలు తెరవాలి. డిస్ర్టిబ్యూటర్‌ లేదా ఎమర్జెన్సీ సర్వీస్‌ సేవలను (నంబర్‌ 1906) వినియోగించాలి. గ్యాస్‌ వాసన వస్తుందని భావించిన పక్షంలో రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేయాలి. వాడకంలో లేని సిలిండర్‌పై సేఫ్టీ క్యాప్‌ను తప్పక బిగించి ఉంచాలి.


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts