తీర్థయాత్రలు ఎందుకు చేస్తాము? తీర్థ యాత్రలెందుకు చేయాలి?

  •  
  •  
  •  

 

తీర్థ యాత్రలెందుకు చేయాలి? ఈ ప్రశ్నకు ఎవరికి తగ్గ జవాబు వారి దగ్గరుంటుంది. పూర్వం సంసారిక ఆనందాల్ని సౌఖ్యాలని త్యజించాలనుకునే వారు తీర్థయాత్రలు చేసేవారు. లేదా చిరకాలం సంతాన ప్రాప్తి లేక బాధపడే వారు, లేదా తమ తమ మొక్కులు తీర్చమని పరాత్పరుని వేడుకుని, తీరిన తర్వాత గాని, లేదా తీరక ముందు గాని దర్శనార్ధులై తీర్థ యాత్రలు చెయ్యడం మనం చూస్తూ వచ్చాము.

అసలు తీర్థ స్థానాలు ఎందుకు అంత పవిత్రతను సంతరించుకున్నాయి? మనిళ్ళల్లోనే  మనం నిత్యం భగవంతునికి పూజలు నిత్య  నైవేద్యాలు సమర్పించుకుంటుండగా వేరే తీర్థ స్థానాలు ఎందుకు సందర్సించాలి? ఇలాంటి ఎన్నో అనుమానాలు మనలో ఎవరో ఒకరికి ఎదో ఒక సందర్భంలో తప్పక వచ్చే ఉంటాయి.

MUST READ :• గొడుగు పుట్టుకకి కారణం వెనుక వున్న అంతరార్ధం

మరి, ఎందుకో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? తీర్థ యాత్ర అనేది భగవంతుని దర్శించుకోవడానికి మానవుడు తొలి రోజుల్లో ఎంచుకున్న భక్తి మార్గం. భక్తి మార్గం అనగా మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా భగవంతునిపై నమ్మకముంచి, వేరే ఎటువంటి సంసారిక విషయాలలోనూ లేదా సౌఖ్యాలలోను మనసును పోనివ్వకుండా ధ్యానమగ్నులమై నిష్ఠగా ఆ పరాత్పరుని సన్నిధికి చేరుకోవడం.

MUST READ :ధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు

నేటి ఆధునిక యుగంలో తీర్థయాత్ర అంటే బస్సులోనో, ట్రైన్ లోనో లేదా విమానంలోనో, ఎదో ఒక సులభ మార్గంలో వెళ్లి రెండ్రోజులు ఉండి  (అవకాశాన్ని బట్టి)  దర్శనం చేసుకుని, చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు చూసుకుని మళ్లీ స్వస్థలాలకు చేరి మన పనుల్లో చేరిపోవడమే. కానీ నిజమైన తీర్థయాత్రకు అర్ధం ఇది కాదు. తీర్థస్థలాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క మహిమ కలిగి ఉండడం విశేషం. ఈ తీర్థ స్ధలాలు కొన్ని ప్రత్యేక స్థల పురాణం కలిగి ఉన్నాయి. ఆ ప్రదేశాలలో ఉన్న ప్రకృతి ఎంతో పవిత్రమైనదై ఉండడం ఒక విశేషమైతే, అటువంటి తీర్థ స్థలాల్లో ఉండే నీరు, మొక్కలు మరియు రాళ్లకు సైతం ఎన్నో ఔషధ గుణాలుండడం, వాటి ఉపయోగం వలన కొన్ని రకాల రుగ్మతలు తగ్గి మనుషులు స్వస్థ మనస్కులు కావడం మరియు ఆరోగ్యం కుదుట పడటం జరుగుతుంది. ఇవి ఐహికమైన కోర్కెలతో తీర్థయాత్రలు చేసేవారికి ఇలలో కలిగే లాభాలు.

మరి ఇహమందు మనసు వదిలేసి భగవంతుని మీదే ధ్యానమగ్నులై చివరివరకూ పరాత్పరుని సన్నిధిలోనే గడపాలనుకునేవారు తీర్థయాత్రలలోనే వారి శేష జీవితాలను గడిపేవారు. అలాంటివారి జీవితం ఒక పద్ధతిగా జరగాలి. ఇలాంటి ఒక పద్ధతిలో నడవడం సాధారణమైన ఇళ్లల్లో కష్టతరం. కావున వారు సంసార సౌఖ్యాలు విడిచిపెట్టి, ఈ తీర్థ స్థానాలవైపు నడక సాగించేవారు.

MUST READ :విష్ణువు మొద‌టి అవ‌తారం ఎత్తిన ప్ర‌దేశం


  •  
  •  
  •  
error: Content is protected !!

x

Related Posts

రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం?
ri Guru Raghavendra Swamy Miracles || రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం? MUST READ:అవతారం అనగా-నేమి-?దాని-ప్రయోజనం ఏంటి ?చాగంటి గారి మాటలలో....
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....*
    *నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....* 🕉ఓం నమో వెంకటేశాయ🕉 *‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో డాక్యు...
వీళ్లి ద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా?
  Actor Raghuvaran With His Wife Rohini | వీళ్లిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా? | MUST READ:ఇన్ని నదులు వుండగా గంగ నది కే ఎందుకు అంత...
powered by RelatedPosts