పెళ్ళికూతురు చేతిలో కొబ్బరిబోండంకు అలంకారాలు చెయ్యవచ్చా?

 పెళ్ళికూతురు చేతిలో  కొబ్బరిబోండంకు అలంకారాలు చెయ్యవచ్చా?

పెళ్లి సమయంలో వధువు చేతిలో కొబ్బరిబోండం ఉంటుందని మనందరికీ తెలిసినదే అయితే ఇప్పుడు వివాహాలలో కొబ్బరిబొండం కు అలంకరణలు చేస్తున్నారు. అదీకూడా పిన్నులు అవి గుచ్చిమరీ చేస్తున్నారు. అసలు కొబ్బరిబొండం ఎందుకు పట్టుకోమంటారు దానివెనుక ఉన్న అర్ధం తెలుసుకుందాం…

 కొబ్బరిబోండంను పూర్ణఫలం అని, అది పార్వతీపరమేశ్వర స్వరూపంగా భావించి వధువు కొబ్బరిబోండం పట్టుకుని వస్తుంది. శాస్త్రం ప్రకారం కన్యాదాన ఫలితం పూర్తిగా కన్యాదాతకు దక్కాలంటే సాలంకృత కన్యాదానం చెయ్యాలి. సాలంకృత కన్యాదానం అంటే అమ్మాయి చెవులకు, చేతులకు, మెడకు, నడుముకు, బంగారు ఆభరణాలు పెట్టి కన్యాదానం చెయ్యాలి. అలాగే కన్యాదాత కన్యాదానానికి ముందు దశదానాలు చేసి కన్యాదానం చెయ్యాలి. మరి మధ్య తరగతి కుటుంబీకులకు బంగారం కొనడము కష్టమే. దశదానాలు కూడా మరీ కష్టం. అందుకే దానికి తరుణోపాయంగా, కన్యాదాత వధువు చేతిలో కొబ్బరిబోండం, మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడి కాయ పెట్టి దానం చేస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లే. కొబ్బరిబోండానికి ఎట్టి పరిస్థితులలోను పిన్నులను గుచ్చడం కానీ, లేకపోతే పిచ్చి పిచ్చి అలంకారాలు చెయ్యడదు ఎందుకంటే… కొబ్బరిబోండం పార్వతీపరమేశ్వర స్వరూపం కాబట్టి.

Must Read : 

error: Content is protected !!

x

Related Posts

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
  ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ సినీ న‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మొన్నా న‌డుమ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌లో ఎలా స్ప...
క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?
  తం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో...
శివుడు అంటే ఎవరు?
    ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత ...
powered by RelatedPosts