భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలంటే…!? అయితే ఇదిచదవండి.

 

•(-లక్ష్మీ గాయత్రి గారి సందేశము 09/02/2014 నాడు అంధ్ర భూమిలో ప్రచరించిన ఈ సందేసం మీరు కూడా ఒకసారి పరిశీలించండి).

‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠేబథ్నామి సుభగే త్వంజీవ శరదాం శతమ్’’

ఇది కల్యాణ మంత్రం. రెండు జీవితాలను ఒకటిగా చేసి ముడివేసేదే మాంగల్యం.
వివాహం అనేది మనసులను, ఆత్మలను జీవితాంతం ఒకటి చేయగలగాలి. హిందూ సంప్రదాయంలోనైనా, మరే సంప్రదాయంలోనైనా వివాహ క్రతువుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అగ్నిసాక్షిగా వేద మంత్రాల మధ్య మాంగల్య బంధంతో ఒకటతైన ఆలుమగలు ఆ బంధానికి జీవితాంతం కట్టుబడి ఉండాలి. అలా ఉండాలి అంటే ఇద్దరికీ ఒకరిమీద మరొకరికి నమ్మకం అవగాహన, సయోధ్య చాలా అవసరం. ఇవన్నీ పుష్కలంగా ఉన్న చోట ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ఇష్టం వాటంతటవే ఉంటాయి, వస్తాయి, అల్లుకుపోతాయి కూడా.

MUST READ :ఇంట్లో కుర్చోని ఫోన్ చూస్తో సంపాదించుకోవచ్చు పైసా కర్చులేకుండా ఇలా చేయండి

భార్యాభర్తలు సంసార రథానికి రెండు చక్రాల వంటివారు. రెండు చక్రాలలో ఏది సరిగా లేకపోయినా రథం నడవడానికి ఎలా కుదరదో, దంపతులలో పరస్పర అనురాగం లేకపోతే, ఆ సంసారం కుంటుపడుతుంది.

వైవాహిక జీవితం సాఫీగా సాగాలన్నా, దంపతుల మధ్య మనస్పర్థలు లేకుండా ఉండాలన్నా. ఈ క్రింది విషయాలను గనించండి.

* వైవాహిక జీవితం ఎలా ఉండాలి?
• -చిలిపి తగాదాలతో, సరదాలతో హాయిగా సాగిపోవాలి.

MUST READ :ఆరోగ్యానికే కాదు…అందానికీ రక్ష… ద్రాక్ష

*ప్రేమ పెళ్ళిళ్ళు మంచివా, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు మంచివా…
• -ప్రేమించి పెళ్లిచేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా, కలతలు – అపార్థాలు లేకుండా వైవాహిక జీవితం గడిచిపోతే ఏ ఇబ్బందీ ఉండదు.

* భార్యాభర్తల మధ్య కలతలు ఎందుకు వస్తాయి?
• -ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనుకున్నపుడు ఇరువురిమధ్య అహంభావం తొంగి చూస్తుంది. అలాంటి సమయాలలోనే కలతలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకని అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి.

MUST READ :ఇంట్లో కుర్చోని ఫోన్ చూస్తో సంపాదించుకోవచ్చు పైసా కర్చులేకుండా ఇలా చేయండి

* ఆలుమగలమధ్య ఉండకూడనిది?
• -ఇరువురిమధ్య అనుమానాలు రాకూడదు. ఆ విధంగానే వాళ్ళూ, వీళ్ళూ చెప్పే మాటలకు విలువ ఇవ్వకూడదు. వారిద్దరిమధ్య వచ్చే సమస్యలను వాళ్ళిద్దరే చర్చించుకుని పరిష్కరించుకోవాలి. వారిరువురి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. అలా కనుక జరిగితే ఒక్కోసారి చిన్నగా ఉన్న సమస్య కూడా పెద్దగా మారి ఆలుమగలు విడిపోయే పరిస్థితి ఎదురవ్వవచ్చు. అలా పరిస్థితి ఎదురవకుండా చూసుకోవటం వారి చేతుల్లోనే ఉంటుంది.

MUST READ :హిందు ధర్మం ప్రకారం ‘దీపావళి’కి ఉన్న ప్రాముఖ్యత

* ఆలుమగలలో ఒకరి అవసరం మరొకరికి అవసరమా?
• -ఏ దంపతులైనా ఒకరి అవసరం మరొకరికి ఎప్పుడూ ఉంటుంది. ఉండాలి కూడా. అలా ఉండకపోతే దాంపత్య బంధాన్ని అవహేళన చేసినట్లవుతుంది.

* ఆలుమగల మధ్య ‘రాజీ’ ఉండాలా?
• తప్పనిసరిగా ఉండాలి. ఆ మాటకొస్తే పెళ్ళనేదే ఒక పెద్ద ‘రాజీ’. ఎందుకంటే- విభిన్న అలవాట్లు, సంప్రదాయాల మధ్య పెరిగిన ఇద్దరు మూడుముళ్ళ బంధంతో ఒకటవుతారు. అంటే ఆ విధంగా ‘రాజీ’ అక్కడే ప్రారంభం అయిందన్నమాట. అందుకే ఏ విషయంలోనైనా ఆలుమగలు రాజీపడక తప్పదు. అయినా ఆ విధంగా ఒకరికోసం మరొకరు పరస్పర ఇష్టాలను, అభిరుచులను గౌరవించుకుంటూ ‘రాజీ’ పడటంలో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది.

MUST READ :మెరిసే ముఖం కోసం..బ్యూటీ టిప్స

* భార్యాభర్తలమధ్య సంబంధం ఎలా ఉండాలి?
• -ఒక ఆడ, ఒక మగ వివాహ బంధంతో ఒకటవుతారు. పెళ్ళయిన మరుక్షణం నుండీ ఒకరికొకరు అన్నట్లుగా బ్రతుకుతారు. కష్టసుఖాలను సమానంగా పంచుకుంటూ, ప్రతి చిన్న విషయానికీ ఒకరినొకరు సంప్రదించుకుంటూ ఎంతో హాయిగా గడుపుతారు. అటువంటి వైవాహిక జీవితానికి నమ్మకమే పునాది. అలాగే ఆ నమ్మకానికి అనుబంధం, అవగాహన తోడైతే ఆ ఆలుమగల బంధం ఎంతో పటిష్టంగా ఉంటుంది.

* భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలంటే…!
• -ప్రతి చిన్న విషయానికీ భూతద్దంలోంచి చూడకూడదు. దీనివల్ల ఇద్దరిమధ్యా.. అభద్రతాభావం చోటుచేసుకుంటుంది. అది ఇద్దరికీ మంచిది కాదు. ఆలుమగలు ఒకరి నీడలో మరొకరు హాయిగా ఉన్నాం అని అనుకోగలగాలి. అప్పుడు ఆ దాంపత్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు.

MUST READ :సీతాఫలం పండు ఒక సంజీవని


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts