మనకి, మన ఇంట్లో వారికి మృత్యు దోష నివారణకు కాలాష్టమి వ్రతం…..

 

మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం మృత్యు దోషం ఉన్న వాళ్ళు ఏమి చెయ్యాలో ఏ దేవాలయానికి వెళ్ళాలో అని ఆలోచిస్తుంటారు. ఈ వ్రతం ఆచరించటం వలన అప మృత్యు దోషాలు తొలగుతాయి. పనులు శుభప్రదంగా జరుగుతాయి.

MUST READ :కాలస‌ర్ప దోషం అంటే ఏమిటి? ఇది ఉంటే అంతా చెడే జ‌రుగుతుందా?
1. కాలాష్టమి అంటే ఏమిటి?
ప్రతి కృష్ణ పక్ష అష్టమికీ కాలాష్టమి వ్రతం చేస్తారు. పౌర్ణమి తరువాత వచ్చే అష్టమి కాలాష్టమి అంటారు. ఇది కాల భైరవుని అనుగ్రహం కొరకు చేసే వ్రతం. ఆదిత్య పురాణం లో కాలాష్టమి గురించిన వివరణ ఉంటుంది.

MUST READ :ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం

2. కాలాష్టమీ వ్రతం ఎలాచేయాలి?
సూర్యోదయానికి ముందే స్నానమాచరించి కాల భైరవుని ఆరాధించాలి. ఆరోజున పితృదేవతలను స్మరించాలి. ఉపవాసదీక్షను పాటించాలి. కాలభైరవుని మందిరానికి లేదా ఏదైనా శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.

MUST READ :ప్రభుత్వోద్యోగులకు ఈజీగా పాస్ పోర్టు

3. కాలాష్టమీ వ్రతం చేయడం వలన కలిగే శుభాలు
కాలాష్టమీ వ్రతం ఆచరించడం వల్ల ఇంటిలోని వారికి అప మృత్యు దోషాలు తొలగుతాయి. దిష్టి దోషాలు తొలగుతాయి.కాలష్టమీ వ్రతాన్ని చేయడం వీలు పడని పరిస్థితి ఉంటే , ఆరోజున సూర్యోదయానికి ముందు స్నానమాచరించి. శివాలయ దర్శనం చేసుకుని, నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టాలి. దీనివల్ల ఆకస్మిక ప్రమాదాలూ, మరణాలూ జరగకుండా, పనులు శుభప్రదంగా జరుగుతాయి.

MUST READ :తరిగొండ వెంగమాంబ ఆలయం


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts