మెరిసే ముఖం కోసం..బ్యూటీ టిప్స

 

అందంగా క‌నిపించ‌డం కోసం నేడు మ‌హిళ‌లు అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్ల‌డం లేదంటే వివిధ ర‌కాల క్రీములు, పౌడ‌ర్లు గ‌ట్రా రాయ‌డం, అవ‌స‌ర‌మైతే న్యూట్రిషన్ పిల్స్ మింగ‌డం వంటి అనేక ప‌నులు చేస్తున్నారు. కానీ వాటి వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్ ను మాత్రం వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బాధ లేకుండా అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధతుల‌తో కూడిన చిట్కాల‌ను పాటిస్తే కేవ‌లం 2 వారాల్లోనే చ‌ర్మ కాంతిని పెంచుకోవ‌చ్చు. దీంతో చ‌ర్మం మృదుత్వాన్ని కూడా సంత‌రించుకుంటుంది. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

MUST READ :

  1. ఒక టేబుల్ స్పూన్ కీర‌దోస ర‌సంలో కొంత నిమ్మ‌ర‌సం క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించాలి. అనంత‌రం చ‌ర్మం పొడిగా అయ్యాక క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం కాంతిని పొందుతుంది. చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.
  2. ముల్లంగి ర‌సాన్ని తీసి దాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది. చ‌ర్మం మృదుత్వాన్ని పొందుతుంది.

MUST READ :ఎలాంటి కీళ్ల నొప్పులనైనా త‌గ్గించే అద్భుత‌మైన ఔష‌ధం.!

  1. ఉసిరి కాయ ర‌సం 1 టీస్పూన్‌, తేనె 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని రెండింటినీ బాగా క‌ల‌పాలి. అనంత‌రం ముఖానికి రాసుకోవాలి. రాత్రి పూట ఇలా చేయాలి. ఉద‌యాన్నే క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం ఆరోగ్యాన్ని పొందుతుంది. కాంతివంతంగా మారుతుంది.

MUST READ :

  1. రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు కొద్దిగా పెరుగును తీసుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. రోజూ ఇలా చేస్తే కేవ‌లం 2 వారాల్లోనే ముఖం సౌంద‌ర్యాన్ని పొందుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంలో ఉన్న మృత‌క‌ణాలు, దుమ్ము, ధూళి తొల‌గిపోతాయి.

MUST READ :

  1. తేనె, దాల్చిన చెక్క పొడిల మిశ్ర‌మాల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని ముఖానికి రాయాలి. కొద్ది సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ప్ర‌కాశవంతంగా మారుతుంది.
  2. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పాల‌ను తీసుకుని బాగా క‌లిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే దుమ్ము, ధూళి క‌ణాలు పోయి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

 MUST READ :అన్నం తినడంలో కుడిచేతిని ఉపయోగించడం ఎక్కడి నుండి వచ్చింది?

 నారింజ పండు తొక్క‌ల‌ను ఎండ బెట్టి పొడి చేయాలి. ఈ పొడికి కొంత పాలు క‌లిపి అనంతం వ‌చ్చే మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే చ‌ర్మం మృదువుగా మార‌డ‌మే కాదు, కాంతివంతంగా కూడా అవుతుంది.

  1. బొప్పాయి పండు ముక్కను తీసుకుని దాన్ని పేస్ట్‌లా చేసి అందులో నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి 30 నిమిషాలు ఆగాక క‌డిగేసుకోవాలి. దీంతో చ‌ర్మంపై ఉండే మృత క‌ణాలు పోయి కొత్త క‌ణాలు ఏర్ప‌డుతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

MUST READ :పెళ్ళిలో బుగ్గన చుక్క పెట్టటంలో అర్ధం ఏమిటి.?

  1. ఒక టొమాటోను తీసుకుని దాన్ని మెత్త‌ని పేస్ట్‌లా మార్చుకోవాలి. అందులో కొంత నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం మంచి రంగును సొంతం చేసుకుంటుంది. మృదువుగా కూడా మారుతుంది.
  2. ఒక టేబుల్ స్పూన్ తేనె, అంతే మోతాదులో ప‌సుపును తీసుకుని మిశ్ర‌మంగా క‌లిపి ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీని వ‌ల్ల చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

MUST READ :కార్తీక మాస వ్రతం ప్రాముఖ్యత

MUST READ :అందాన్ని మెరుగుపరిచే మూలకాలు వంటగదిలోనే ఉన్నాయి

error: Content is protected !!

x

Related Posts

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
  ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ సినీ న‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మొన్నా న‌డుమ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌లో ఎలా స్ప...
క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?
  తం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో...
శివుడు అంటే ఎవరు?
    ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత ...
powered by RelatedPosts