మోచేతులు, మోకాళ్ళ పై ఉన్న నలుపు పోగొట్టుకోవడానికి సింపుల్ చిట్కాలు

 

మోచేతులు, మోకాళ్ళ పై ఉన్న నలుపు పోగొట్టుకోవడానికి సింపుల్ చిట్కా.. శరీరంలో అత్యధికంగా మృతకణాలు మోచేతులు, మోకాళ్ళు, మడమలు, చీలమండల దగ్గర ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల చేతులు, కాళ్ళు అందవిహీనంగా కనపడతాయి. వీటిని మరల మాములు రంగులోని మార్చడానికి కొన్ని పద్ధలు ఉన్నాయి. ఇంట్లో ఉపయోగించే వాటితో అతి సులభంగా మీ మోచేతులు, కాళ్ళు మళ్ళీ రంగుని సంతరించుకునేలా చేసుకోవచ్చు. కొంత మంది మోచేతుల పై బరువుని అధికంగా మోపడం వలన అక్కడ వత్తిడి ఏర్పడి నల్లగా మారిపోతాయి. అదేవిధంగా ఇంట్లోనే ఉంటున్నాం కదా ! నల్లగా ఉంటే ఉండనీ ఏమైంది అని గృహిణులు అనుకుంటూరు. కాని అలా వదిలేయడం వలన మృతకణాల సంఖ్య ఎక్కువైపోయి మీ మోచేతులు అసహ్యంగా మారుతాయి. అందుకే చిన్న సమస్యగా ఉన్నప్పుడే దాన్ని అరికట్టడం మంచింది.

MUST READ :ఆంజనేయుడు స్వయంభువుగా వెలిసిన క్షేత్రం

చిట్కాలు:-

 

1. బేకింగ్‌ సోడా:-

బేకింగ్‌సోడా చర్మాన్ని శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని నిగారించేలా చేస్తుంది. అదే విధంగా పాలు కూడా బ్లీచింగ్‌ గుణాలు కలిగి ఉండటం వలన చర్మాన్ని శుభ్రపరచి నల్లని రంగును తగ్గిస్తుంది.
ఒక టీ స్పూన్‌ బేకింగ్‌ సోడాని తీసుకొని దానిలో కొద్దిగా పాలు కలపాలి.
ఈ మిశ్రమాన్ని మోచేతులకు, మోకాళ్ళకు రాసి వలయాకారంలో మసాజ్‌ చేయాలి.
ఈ పద్ధతిని 2 రోజులకు ఒక సారి చేయడం వలన మోచేతులు, మోకాళ్ళ రంగులో మార్పును మీరు గమనిస్తారు.

2. పసుపు, తేనె మరియు పాలు:-

పసుపు యాంటి సెప్టిక్‌ లాగా పని చేస్తుంది. దీనిలో బ్లీచింగ్‌ గుణాలు ఉన్నాయి. తేనె మాయిశ్చరైజర్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది మరియు దీనిలో కూడా యాంటి సెప్టిక్‌ గుణాలు కూడా ఉన్నాయి. పసుపు, తేనె మరియు పాలు కలయిక వలన నల్లని చర్మాన్ని తెలుపు రంగులోకి మార్చడంలో సహాయపడుతుంది. మృతకణాలను తొలగించి మునుపటి రంగులోని మార్చడానికి తోడ్పడుతుంది.
కొద్ధిగా పసుపు తీసుకుని అందులో పాలు, తేనె కలిపి మెత్తని పేస్ట్‌ చేయాలి.
ఈ పేస్ట్‌ని నల్లని మోచేతులకు, మోకాళ్ళకు రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి.
తరువాత 2 నిమిషాలు మసాజ్‌ చేసుకొని నీటితో శుభ్రపరుచుకోవాలి.

MUST READ :వెండి వస్తువులు గిఫ్ట్ ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా ? ఇస్తే ఏమవుతుంది ?

3. పంచదార మరియు ఆలివ్‌ ఆయిల్‌ :-

ఆలివ్‌ ఆయిల్‌ సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ లాగా మరియు పంచదార సహజసిద్ధమైన స్క్రబ్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది.
ఆలివ్‌ ఆయిల్‌ మరియు పంచదారని సమాన నిష్పత్తిలో తీసుకొని పేస్ట్‌ చేయాలి. తయారయిన మిశ్రమాన్ని నల్లని మోచేతులకు, మోకాళ్ళకు రాసుకోవాలి.
5 నిమిషాల పాటు చర్మాన్ని స్క్రబ్‌ చేసుకొని మైల్ట్‌ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.

4. నిమ్మరసం మరియు తేనె:-

నిమ్మరసం లో సహజసిద్ధమైన బ్లీచింగ్‌, తేనెలో మాయిశ్చరైజర్‌ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని నల్లనిరంగు నుండి మామూలు స్ధితికి మార్చడంలో సహాయపతాయి.
కొద్ధిగా నిమ్మరసం తీసుకొని దానిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెని కలపాలి.
ఈ నిమ్మ మరియు తేనె మిశ్రమాన్ని కనీసం 20 నిమిషాలు పాటు మోచేతులకు, కాళ్ళకు రాసుకొని ఉండాలి.
20 నిమిషాలు గడిచిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి.
ఇలా చేయడం వల్ల మోచేతులు, మోకాళ్ళ మంచి రంగుని సంతరించుకుంటాయి.

MUST READ :లక్ష్మి దేవి పూజ ఇలా చేయండి

5. శనగపిండి మరియు నిమ్మరసం:-

శనగపిండి చర్మాన్ని శుభ్రం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇది వాడటం వలన చర్మం మంచి రంగుని పుంజుకుంటుంది. నిమ్మరసం, శనగపిండి ఈ రెండిటి మిశ్రమాన్ని వాడటం వలన నల్లని చర్మం నుండి విముక్తి పొందవచ్చు.
కొద్ధిగా నిమ్మరసం తీసుకొని అందులో శనగపిండి కలిపి మోచేతులకు, మోకాళ్ళకు రాసుకొని కొద్ధిగ సమయం గడిచిన తరువాత శుభ్రంగా కడగాలి.
ఈ విధంగా చేయడం వలన నల్లని చర్మం నుండి విముక్తి పొందవచ్చు.

6. ఆలివ్‌ ఆయిల్‌ :-

ఆలివ్‌ ఆయిల్‌ సహజసిద్ధమైన బ్లీచింగ్‌ గుణాలు కలిగి ఉండటం వలన ఇది చర్మాన్ని నిగారించేలా చేస్తుంది.
గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌ ని మోచేతులకు, మోకాళ్ళకు రాసుకొని 10 నిమిషాల గడిచిన తరువాత శుభ్రంగా కడగాలి.
ఇలా రోజూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

MUST READ :బ‌ర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను వెలిగించ‌డం వెనుక మనకు తెలియని నిజాలు.!

7. క్లీనింగ్‌ బ్రష్‌ :-

బ్రష్‌ తో చర్మాన్ని శుభ్రం చేయడం వలన మృతకణాలను తొలగించవచ్చు.
స్నానం చేసేటప్పుడు బ్రష్‌ తో శుభ్రం చేసుకోవడం వల్ల సులభంగా మృతకణాలను పోగొట్టవచ్చు.

8. కోకో బట్టర్‌ లేదా షియా బట్టర్‌ :-

చక్కని మాయిశ్చరైజర్‌ లా ఈ రెండు పనిచేస్తాయి. ఇవి చర్మం రంగుని మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
కోకో బట్టర్‌ లేదా షియా బట్టర్‌ ని పడుకునే ముందు మోచేతులకు, మోకాళ్ళకు రాసుకోవాలి.
మరుసటి రోజు ఉదయం నీటితో శుభ్రపరుచుకోవాలి.

9. అలోవెరా :-

అలోవెరా జెల్‌ సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని నమం చేయగలదు. అదేవిధంగా ఎటువంటి చర్మసంబంధ అలర్జీ ఉన్నా వాటిని రూపుమాపగలదు. అలోవెరా లో చర్మాన్ని ప్రకాశవంతంగా చేయగల శక్తి ఉంది.
తాజా కలబంధ ముక్కలను తీసుకొని దానినుండి జెల్‌ని బయటకు తీయాలి. తీసిన జెల్‌ని మోచేతులకు, మోకాళ్ళకు రాసుకొని అరగంట గడిచిన తరువాత నీటిలో శుభ్రపరుచుకోవాలి.
ఇలా రోజూ చేయడం వలన అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు.

MUST READ :ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక బరువు తగ్గిపోయే సూపర్ హోం రెమిడీ

11. బ్లీచింగ్‌ ప్రూట్స్‌ :-

నిమ్మకాయ, టమాటా మరియు ద్రాక్షాపళ్ళు వీటిన్నింటిలో బ్లీచింగ్‌ గుణాలు ఉన్నాయి. వీటిని రోజు వాడటం వలన చర్మం క్రమక్రమంగా రంగుని సంతరించుకుంటుంది.
పైన తెలిపిన బ్లీచింగ్‌ గుణాలు కలిగిన పండ్ల రసాన్ని మోచేతులకు, మోకాళ్ళకు రాసుకోవటం వలన చక్కటి ఫలితాన్ని పొందుతారు.
మీరు వేరువేరు రోజుల్లో వేరు వేరు పండ్లు రసాలు ఉపయోగించవచ్చు.

12. వెనీగర్‌ మరిము పెరుగు :-

వెనీగర్‌ మరియు పెరుగు కలిపి వాడటం వలన నలుపు రంగుని తగ్గించేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా ఇవి చర్మానికి తేమను అందచేస్తాయి.
వెనిగర్‌ మరియు పెరుగు కలిపి, నల్లని చర్మానికి రాసుకొని వలయాకారంలో మసాజ్‌ చేసుకోవాలి
కొంత సమయం గడిచిన తరువాత శుభ్రంగా కడగాలి.
చూసారు కదా… అతి తక్కువ ఖర్చుతో సులభంగా, ఇంట్లోనే ఉంటూ పాటించే చిట్కాలు ఇవి. వీటిని వాడటం వలన మీ మోచేతులు, మోకాళ్ళ నలువు రంగును వదిలించుకోవచ్చు. క్రమం తప్పకుండా వాడటం వలన త్వరిత ఉపసమనాన్ని పొందుతారు.

MUST READ :పొగ తాగడం మానేసిన తరువాత, మన శరీరానికి ఎం జరుగుతుంది?

error: Content is protected !!

x

Related Posts

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
  ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ సినీ న‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మొన్నా న‌డుమ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌లో ఎలా స్ప...
క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?
  తం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో...
శివుడు అంటే ఎవరు?
    ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత ...
powered by RelatedPosts