వివాహం ఆలస్యం అవుతున్న వారు చేయవలసిన వ్రతం

వివాహం ఆలస్యమవుతోందా..? సంతానం కలగడం లేదా..? ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ సమస్యలకు చక్కని పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజ. ప్రతి మాసం లోనూ వచ్చే శుద్ధ షష్టి నాడు మాస షష్టి వ్రతం చేయడం అత్యంత శుభకరం.

 MUST READ :భోగి పండ్లు ప్రాముఖ్యత ఏమిటి?

1. మాస షష్టి వ్రతం ఎలా చేయాలి ?

సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి షష్టి. షష్టి తిథి స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజున సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించాలి.స్వామికి శాస్త్ర యుక్తంగా షోడశోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆరోజున ఉపవసించడం అత్యంత శ్రేయస్కరం. సమీపం లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి, స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి

2. దక్షిణ

షష్టి రోజున బ్రహ్మచారికి భోజనం పెట్టి, తాంబూలం, దక్షిణ సమర్పించాలి.  కుజ దోషాలు ఉన్నవారు ఎర్ర కందులను దానం చేయాలి.

3. షష్టి పూజ వలన కలిగే లాభాలు 

సుబ్రహ్మణ్య స్వామి అంగారక(కుజ) గ్రహానికి అధిపతి. కనుక కుజుని వలన కలిగే అన్ని దోషాలనూ షష్టి వ్రతం చేయడం వలన నివారించవచ్చు. షష్టి వ్రతం చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్నవారికి శీఘ్ర వివాహం జరుగుతుంది. ధనప్రాప్తి కలుగుతుంది.

4.  సుబ్రహ్మణ్య స్వామికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది ?

సుబ్రహ్మణ్య స్వామికి అరటిపళ్లు నైవేద్యం పెట్టడం వలన సంతానం కలుగుతుంది. ఎర్ర కందులతో చేసిన పాయసాన్ని నివేదించడం వలన కుజగ్రహ దోషాలు తొలగుతాయి. దానిమ్మ పళ్లను నివేదించడం ద్వారా ఐశ్వర్య సిద్ధి, వివాహ యోగం కలుగుతాయి.

శుభం భూయాత్.

MUST READ :తీర్థయాత్రలు ఎందుకు చేస్తాము? తీర్థ యాత్రలెందుకు చేయాలి?


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts