సంగీత శిఖరం ఏ ఆర్ రెహమాన్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు

  •  
  •  
  •  

 

అతని సంగీత ప్రభావానికి నేను కూడా లోనుకాక తప్పలేదు, నాకు రెహ్మాన్ అంటే భయం అంతకుమించి జెలసీ ఇవి ప్రఖ్యాత స్వరకర్త “ఎస్ ఎల్ వైద్యనాథన్” అన్న మాటలు, అదీ భారతదేశం గర్వించతగ్గ స్థాయిలో ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేసుకున్న ప్రముఖ స్వరకర్త,గాయకుడు,గీత రచయిత ఐన ఏ ఆర్ రెహమాన్ గురించి చెప్పినవి..

ఏ ఆర్ రెహమాన్ భారత్ కి పరిచయం చెయ్యక్కరలేని అసలు సిసలు సంగీత దర్శకుడు,25 సంవత్సరాలుగా సంగీత అభిమానులని తన సంగీతం తో అలరిస్తున్నవ్యక్తి..

MUST READ :కాలస‌ర్ప దోషం అంటే ఏమిటి? ఇది ఉంటే అంతా చెడే జ‌రుగుతుందా?

రెహమాన్ 9 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు రెహమాన్ తండ్రి చనిపోయారు ..తండ్రి శేఖర్ ఉపయోగించిన సంగీతపరికరాలని అద్దె కి ఇస్తూ కుటుంబ భాద్యతని మొయ్యడానికి సిద్ధపడ్డ రెహమాన్ తన 11 ఏళ్ళ వయసునుండే గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు.తన చిన్నప్పటి ఫ్రెండ్స్ శివమణి,సురేష్ పీటర్స్ తో కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్ ని కూడా నడిపేవాడు రెహమాన్.

సంగీతానికి టెక్నాలజీ ని కలిపి ప్రయోగాలు చేసిన రెహమాన్.. ఇళయరాజా,రాజ్ కోటి ,రమేష్ నాయుడు వంటి దిగ్గజాలవద్ద పనిచేసాడు.. Western classical music మ్యూజిక్ లో డిప్లొమా కూడా తీసుకున్న రెహమాన్ మొదట ప్రకటనలకి జింగిల్స్ సమకూర్చేవాడు ..అలా ‘సంతోష్ శివన్ ‘ దర్శకత్వం లో ‘మోహన్ లాల్ నటించిన ‘యోధా సినిమాకి సంగీత దర్శకుడుగా మారిన రెహమాన్ అదే సంవత్సరం వచ్చిన ‘మణిరత్నం’ ..’రోజా’ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి యావత్ భారతదేశం తనవేపు చూసేలా చేసాడు.ఇంక వెనుతిరిగి చూడలేదు,శంకర్ ,మణిరత్నం సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు రెహమాన్..

MUST READ :ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం

యువత.. రెహమాన్ సంగీతానికి దాసోహం అయిపోయారు..ఒక సినిమాకాదు, ఒక పాట కాదు, ఒక ఆల్బం కాదు.. అన్నిటా తానే, అంతా తానే అన్నట్టు సంగీతాన్ని నింపేసిన రెహమాన్ దక్షిణాది, ఉత్తరాది సినిమాలకి తనదైన శైలిలో సంగీతాన్ని అందించాడు..

రోజా,బొంబాయి,జెంటిల్ మేన్,ప్రేమికుడు,భారతీయుడు,రంగీలా,ఒకే ఒక్కడు …హిందీ సినిమాలు రంగ్ దె బసంతీ,స్వదేశ్,లగాన్,దిల్ సే,పుకార్,రాంఝానా.. ఇలా చాలా సినిమాలు చేసిన రెహమాన్ ..హాలీవుడ్ మూవీస్ కి కూడా సంగీతం అందించాడు, వాటిలో Warriors of Heaven and Earth, Slumdog Millionaire, 127 Hours, Million Dollar Arm and The Hundred-Foot Journey ఉన్నాయి..

ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా వెస్ట్రన్,శాస్త్రీయ సంగీతం జాజ్, పాప్ అన్నిటిని అవసరం మేరకు తన మ్యూజిక్ లో చూపిస్తాడు రెహమాన్….1999 లో ప్రభుదేవా శోభనతో కలిసి జర్మనీ లో చేసిన సంగీత కార్యక్రమం లో మైఖేల్ జాక్సన్ కూడా perform చెయ్యడం విశేషం..

MUST READ :ప్రపంచంలో అతి ఎక్కువమందికి ఉచితంగా నేత్రవైద్యం అందిస్తున్న సంస్థ. శంకర ఐ ఫౌండేషన్‌

సినిమాలేకాదు స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భం లో తను చేసిన ‘వందేమాతరం’ అనే ప్రైవేట్ ఆల్బం రెహమాన్ సినిమా కి తెచ్చినంత పేరు తెచ్చింది.. రెహమాన్ Surround Sound Technology ని దక్షిణాది సినిమాలకి పరిచయం చేసాడు.

ఎన్నో సినిమాలకి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు గాను రెహమాన్ ని 2010 లో భారతప్రభుత్వం ‘పద్మభూషణ్ ‘అవార్డ్ తో సత్కరించింది..

“స్లమ్‌డాగ్ మిలియనీర్” అనే చిత్రంలో ‘జై హో’ అనే పాటకు సమకూర్చిన సంగీతానికి గాను ప్రతిష్ఠాత్మకమైన “గోల్డెన్ గ్లోబ్ అవార్డు”, రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు రెహమాన్. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని, భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహమాన్ కి మాత్రమే సొంతం, జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా అవార్డ్ అందుకున్నాడు, హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను సాధించాడు రెహమాన్..

MUST READ :రావి చెట్టు (అశ్వద్ధ వృక్ష) మహిమ

సంగీతం మీదుండే ప్రేమ తో తనే స్వయం గా సంగీత పాఠశాల ” కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ”ని 2013 లో ప్రారంభించాడు. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను, పేదపిల్లల కోసంఏర్పాటు చేసి …సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు.
తాను స్థాపించిన ఈ సంగీత కళాశాల సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని రెహమాన్ చెప్పాడు.

MUST READ :” చండీ హోమం ” అంటే ఏమిటి .? చండీ హోమం విశిష్టత ఏమిటి .?

రెహమాన్ సంగీతం గురించి ప్రముఖ డైరెక్టర్ ” Baz Luhrman ” మాటల్లో..

I had come to the music of A. R. Rahman through the emotional and haunting score of Bombay and the wit and celebration of Lagaan. But the more of AR’s music I encountered the more I was to be amazed at the sheer diversity of styles: from swinging brass bands to triumphant anthems; from joyous pop to West-End musicals. Whatever the style, A. R. Rahman’s music always possesses a profound sense of humanity and spirit, qualities that inspire me the most.

సంగీతాన్ని ఇష్టపడేవాళ్ళకి రెహమాన్ సంగీతం ఒక వ్యసనం లాంటిది ఒక్కసారి కనెక్ట్ అయితే బయటికిరావడం కష్టం.. ప్రతి గాయకుడు, గాయని ఒక్కసారైనా రెహమాన్ సంగీతం లో పాడాలనుకుంటారు… “పరువం వానగా ..రోజా,చికు బుకు రైలే..జెంటిల్ మేన్,పచ్చని చిలకలు తోడుంటే .. భారతీయుడు”, ఇలా చెప్పాల్సి వస్తే ఎన్నో..ఇవన్నీ ఆణిముత్యాలే..

సంగీతం శ్వాసగా బ్రతికే రెహమాన్ వివాదాలకి దూరం గా ఉంటారు..నిన్న మొన్న వచ్చిన ‘సాహసం శ్వాసగా ‘ సాగిపో సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి దక్షిణాది భాషలకి దూరం కాలేదని నిరూపించిన సంగీత శిఖరం ఎ. ఆర్ రెహమాన్..
50 సంవత్సరాల వయసులో కూడా అన్ని వయసులవాళ్ళకి,ఆన్ని రకాల సంగీతాన్ని ఇష్టపడేవాళ్ళకి నచ్చేలా సంగీతం అందించడం అదీ సెలెక్టివ్ పాటల సృష్టికర్తగా సంగీతాభిమనులని అలరించడం రెహమాన్ కి మాత్రమే చెల్లింది..
జయహో రెహమాన్..

MUST READ :ఆన్‌లైన్ లో ఉన్న మన ఆధార్ కార్డ్ వివరాలనుఎవరు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే… అందుకు కింద చెప్పిన స్టెప్స్ పాటించాలి


  •  
  •  
  •  
error: Content is protected !!

x

Related Posts

రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం?
ri Guru Raghavendra Swamy Miracles || రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం? MUST READ:అవతారం అనగా-నేమి-?దాని-ప్రయోజనం ఏంటి ?చాగంటి గారి మాటలలో....
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....*
    *నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....* 🕉ఓం నమో వెంకటేశాయ🕉 *‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో డాక్యు...
వీళ్లి ద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా?
  Actor Raghuvaran With His Wife Rohini | వీళ్లిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా? | MUST READ:ఇన్ని నదులు వుండగా గంగ నది కే ఎందుకు అంత...
powered by RelatedPosts