సరైన సమయం లో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే వాళ్ళని ఇకకాపాడుదాం రండి

రక్తం సరైన సమయానికి దొరక్క ఎంతో మంది అభాగ్యులు చనిపోతున్నారు! అయితే ఇక అల జరగదు

MUST READ :ఎన్.టి.ఆర్ ఆరోగ్య రక్ష హెల్త్ ఇన్సురన్స్ పధకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?

మన శ‌రీరంలో ర‌క్తం ఎంతో కీల‌క పాత్ర పోషిస్తుంది. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంతోపాటు ఆయా అవ‌య‌వాల నిర్మాణానికి త‌గిన పోష‌కాలు అందించ‌డం, వ్య‌ర్థాల‌ను తీసుకువెళ్ల‌డం వంటి ఎన్నో కీలకమైన ప‌నులు చేస్తుంది.

అయితే ప్రమాదా కార‌ణంగానో లేదంటే అనారోగ్యం వ‌ల్లో ఆస్ప‌త్రిలో చేరితే కొంద‌రు రోగుల‌కు ఒక్కోసారి పెద్ద మొత్తంలో ర‌క్తం అవసరం ఉంటుంది. ఈ క్ర‌మంలో చాలా మంది బ్ల‌డ్ బ్యాంకుల‌ను ఆశ్ర‌యిస్తారు. అక్క‌డా దొర‌క్క‌పోతే తెలిసిన వారిని అడిగి ర‌క్త‌దాతల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు వారు దొరికినా ఎక్క‌డో దూరంలో ఉంటే.. అప్పుడు రోగికి సరైన టైంలో ర‌క్తం అందక ప్రాణాలకే ప్రమాదం వస్తోంది.

MUST READ :గ్యాస్ , అసిడిటీ , అజీర్ణం లను వెంటనేఅత్యంత సమర్థవంతమైన గృహ నివారణలు

 

 

ఇక ఆ సమస్యలకు చెక్ పెడుతూ.. రోగుల‌కు ర‌క్తం త్వ‌ర‌గా అందేలా చేసేందుకు ఓ సంస్థ ప‌నిచేస్తోంది. అదే బ్ల‌డ్ ప్ల‌స్‌ వెబ్‌ సైట్‌ (http://www.bloodplus.in). శ‌శి అనే ఓ సామాజిక బాధ్యత గుర్తించిన ఇంజినీర్ దీన్ని ఏర్పాటు చేశాడు. రక్తం కోసం తన కొలీగ్ కుటుంబం పడిన వేదన అతణ్ణి ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టేలా ప్రోత్సహించింది. అలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న వారికి స‌హాయం అందించ‌డం కోసం ఈ బ్ల‌డ్ ప్ల‌స్ సైట్‌ను మొదలు పెట్టాడు.

MUST READ :సుడిగాలి సుధీర్ గురించి తెలియని షాకింగ్ నిజాలు

అందులో ఔత్సాహికులు త‌మ మొబైల్ నంబ‌ర్, ఉంటున్న అడ్ర‌స్ వంటి వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి పేరు న‌మోదు చేసుకుంటే చాలు, ఎవ‌రైనా అదే ప్రాంతానికి చెందిన వ్య‌క్తికి ర‌క్తం అవ‌స‌రం వ‌స్తే అప్పుడు సంబంధిత ఔత్సాహికులు వెంట‌నే ర‌క్తం ఇచ్చేందుకు అవ‌కాశం ఏర్పడుతుంది. దీంతో చాలా స‌మ‌యం, డ‌బ్బు ఆదా అవుతాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్య‌క్తిని అపాయం నుంచి గ‌ట్టెక్కించ‌ొచ్చు. మీరు కూడా ర‌క్త‌దాత‌లుగా మారాలన్నా.. లేక ర‌క్తం తీసుకోవాల‌న్నా ఈ సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకోండి.. ఈ సామాజిక ప్రయోజనకరమైన విషయాన్ని నలుగురికీ తెలిసేలా షేర్ చేయండి

MUST READ :కుజ గ్రహ దోషాలు తోలగుటకు పూజించవ లసిన వినాయకుడు

error: Content is protected !!

x

Related Posts

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
  ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ సినీ న‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మొన్నా న‌డుమ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌లో ఎలా స్ప...
క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?
  తం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో...
శివుడు అంటే ఎవరు?
    ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత ...
powered by RelatedPosts