.స్వరరారాజు,గానగంధర్వుడు,శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

  •  
  •  
  •  

 

అది 1966 వ సంవత్సరం, డిసెంబర్ 15 వ తేదీ,’శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న’ సినిమా పాటల రికార్డింగ్ జరుగుతోంది, నటుడు ‘పద్మనాభం’ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘కోదండపాణి’ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి చెన్నయ్, అప్పటి మద్రాస్ లో ఉన్న రికార్డింగ్ థియేటర్ లోకి మాంచి హుషారుగా ఉన్న ఓ కుర్రాడు ,మహా అయితే ఓ 20 ఏళ్ళుండచ్చు.. చక చకా వచ్చి తనగొంతు సవరించుకున్నాడు.. పాట అయ్యాకా, అద్భుతంగా పాడావోయ్ అని కోదండపాణి గారు ఆ బాలుడ్ని ఆశీర్వదించారు.అంతేనా! నీకు అద్భుతమైన భవిష్యత్ ఉంటుందని కూడా చెప్పేసారు. చెప్పిన ఆయన్ని,ఆశీర్వదించిన చేతిని వదలకుండా అనుసరించిన ఆ బాలుడే గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం..

MUST READ :రావి చెట్టు (అశ్వద్ధ వృక్ష) మహిమ

బాలు తన చిన్నతనం నుండే పాటల పోటీలలో పాల్గొని బహుమతులను కూడా సొంతం చేసుకున్నారు, తన తండ్రి కోరిక మేరకు మద్రాసు AMIE ఇంజనీరు కోర్సులో చేరి, పూర్తి చేశారు. 1964వ సంవత్సరంలో మద్రాసు ‘సోషల్ అండ్ కల్చరల్ క్లబ్’ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీలలో బాలసుబ్రహ్మణ్యంగారు పాల్గొన్నారు. ఆ పోటీలలో ఆయనకు మొదటి బహుమతి వచ్చింది. అప్పటి సంగీత దర్శకుడయిన ఎస్.పీ.కోదండపాణిగారికి బాలు పాట, పాడిన విధానం రెండూ నచ్చేసాయి.అలా బాలూ, కోదండపాణిగారి శిష్యుడు అయ్యారు..

పాటకు పల్లవి ఎంత ముఖ్యమో, ఆ పాటలో ‘స్వరం’ జీవించడం కూడా అంతే ముఖ్యం.అలా పాడి పాటకి సరైన న్యాయం చెయ్యడం బాలూకే సాధ్యమయ్యింది.పక్క పక్క నే రాసేసిన పదాలన్ని బాలు స్వరం లోచేరితే ఒకపాటలా మారిపోతాయి..అందుకే ఇప్పటికీ ఏదైనా ఒక పాట, ఇంకోసారి.. మళ్ళీ మళ్ళీ వినాలనిపించిందీ అంటే ఆ పాట నిస్సందేహం గా బాలూ పాడినపాటే అయ్యుంటుంది..

MUST READ :పితృ దేవతలు అంటే ఎవరు?మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ??
‘బలిపీఠం’ సినిమాలో ‘కుశలమా నీకు కుశలమేనా’ అని శోభన్ బాబు పాడుతుంటే ..కాదు, కాదు.. శోభన్ బాబు లా, బాలూ పాడుతుంటే ఎవరైన సరే వింటూ మైమరిచిపోవాల్సిందే..’నా పేరు బికారి-శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్ ‘,’రాశాను ప్రేమలేఖలెన్నో-శ్రీదేవి ‘,’ఏ దివిలో విరిసిన పారిజాతమో-కన్నెవయసు’,’జాబిల్లికోసం ఆకాశమల్లే-మంచిమనసులు’,’ప్రేమ ఎంతమధురం-అభినందన’,’మబ్బే మసకేసిందిలే-అందమైన అనుభవం’,’కలనైనా క్షణమైనా మాయనిదే-రాధాకల్యాణం’,’శుభలేఖరాసుకున్నా-కొండవీటిదొంగ’,’హలోగురూ ప్రేమకోసమేరా..నిర్ణయం’,నాపాటపంచామృతం-అల్లరిమొగుడు’,’శ్రీతుంబురనారద నాదామృతం-భైరవద్వీపం’,’రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా-అల్లరిప్రియుడు’,’నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా-అతడు’..ఇలాంటిపాటలు బాలూపాడినవి వేలల్లో ఉన్నాయి, మెలోడియస్ పాటలేకాదు శంకరాభరణం లాంటి శాస్త్రీయసంగీతప్రధానమైన సినిమాల్లోకూడా పాడి అలరించిన బాలూ శాస్త్రీయసంగీతం నేర్చుకోలేదు..ఒక సినిమాకాదు ఒకపాటకాదు..ఒక ఎమోషన్ కాదు.అన్నిటిన్ని తనపాటల్లో చూపించేసారు బాలూ.

MUST READ :సంగీత శిఖరం ఏ ఆర్ రెహమాన్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు

అన్నిమతాలకి సమబంధిన పాటలని పాడారు, ప్రైవేట్ ఆల్బంస్ చేసారు..పాటలకి సంబంధించి వివిధ భాషల్లో జరిగిన, జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు బాలూ.ఎంతోమంది గాయనీగాయకులని వెండితెరకి పరిచయం చేసారు ఈ కళాకోవిదుడు.

తన స్వరం తో పాటకు ప్రాణం పోయగల మధుర గాయకుడు బాల సుబ్రహ్మణ్యం గారు… బాధలో ఉంటే బాలూ పాట ఓదార్పు నిస్తుంది..సంతోషం గా ఉంటే తనపాట ఆ సంతోషం లో హాయిని పెంచుతుంది..వెన్నెల,బాలూ పాట రెండూ కలిస్తే అంతకుమించి లేదనిపిస్తుంది..

కోదండపాణి, చక్రవర్తి ,ఇళయరాజా , కే వీ మహదేవన్,రమేష్ నాయుడు,రాజన్-నాగేంద్ర,సత్యం,కీరవాణి ,ఎఆర్ రెహమాన్ ఇలా ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాటలు పాడిన ఘనత బాలూదే.. ప్రొడ్యూసర్ గా , సంగీతదర్శకుడిగా , నటుడిగా , యాంకర్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలియచేసిన బాలూ ఒకేరోజు 21 పాటలు పాడిన స్వరశాలి, అనేక భాషల్లో సుమారు 45000 పైగా పాటలు పాడిన సరస్వతీపుత్రుడు.

MUST READ :తరిగొండ వెంగమాంబ ఆలయం

గాయకుడిగా అలరించినబాలూ , మన్మధ లీలలు సినిమా తో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మారారు, కమల్ హసన్, రజినికాంత్ లాంటి కథానాయలకు డబ్బింగ్ చెప్పారు.అన్నమయ్య సినిమాలో కలియుగ దైవం వెంకటేశ్వరుని మాటల్లో వినిపించేది బాలూ స్వరమే .అభినవగాంధీ ‘బెన్ కిన్స్ లే’ కి తెలుగొచ్చా.. రాదు, అతని తెలుగు మన బాలూదే.దశావతారం సినిమాలో కమల్ పదిపాత్రలకి పదిరకాలుగా గొంతుని సవరించింది ఈ బాలూనే..

సినిమాలో హీరో స్వరానికి తగ్గట్టు తన స్వరాన్ని పలికించడం బాలూకున్న గొప్పకళ.. పాటేదైనా సరే బాలూగొంతులో చేరితే తనరూపంలోంచి బాలూ స్వరరూపంలోకి మారాల్సిందే..’వెంకటేష్..ఈనాడే ఏదో అయ్యింది’ అంటే,’చిరంజీవి.. తరలిరాద తనే వసంతం అంటే’, ‘నాగార్జున.. ఆమనీ పాడవే హాయిగా ‘అంటే ..నిజంగా వాళ్ళు అన్నట్టే అనిపించేలా పాడటం బాలూకి మాత్రమే సొంతం..

MUST READ :హారతి ఎందుకు ఇస్తాము??

వయసుపెరుగుతుంటే స్వరం లో మార్పురావడం సహజం కానీ బాలూ స్వరసురఘరి లో మార్పురాలేదు ..రాదు..
అల్లురామలింగయ్య వాయిస్ లోనూ పాడగలరు కుర్రాడిలా పాడి అదారగొట్టనూగలరు బాలు.తను పాడుతున్నది కమెడియన్‌‌ కా స్టార్‌ హీరో కా అనేది ఆలోచించకుండా పాటకి, ఆ నటుడిస్వరానికి న్యాయం చేసిన ఏకైక పాటగాడు బాలు .హిందీ పాటలతో ఉత్తరాదినా జెండా పాతేసారు బాలూ, ‘ ఏక్ దూజే కేలియా’ సినిమాకి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం లో ‘తేరేమేరే బీచ్ మే ‘ పాట పాడిన బాలూ అదేపాటకి అవార్డ్ కూడా గెలుచుకున్నారు

ప్రముఖ బీబీసీ రేడియో బాలుతో ముఖాముఖి నిర్వహించింది. ఇందులో ఒక దక్షిణాది కళాకారుడి ఇంటర్వ్యూ ప్రసారం కావడం మొదటిసారి.మన బాల సుబ్రహ్మణ్యం, సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు 40 కి పైనే ఉన్నాయి 11 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డును సృష్టించిన బాలు గంధర్వగానానికి, 4 బాషలలో 6 సార్లు నేషనల్ అవార్డులు లభించాయి. లతామంగేష్కర్ అవార్డుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 సార్లు నంది అవార్డ్ ను కూడా తీసుకున్నారు.ఒకే రోజు వివిధ భాషల్లో 21 పాటలు పాడిన రికార్డును బాలూ సొంతం చేసుకున్నారు… లెక్కలేనన్ని రాష్ట్రస్థాయి అవార్డులు బాలూని వరించాయి, 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు బాలూకోసం క్యూకట్టేసాయి. 2016 సంవత్సరానికి కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘సెంటెనరీ అవార్డు ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ’ పురస్కారం బాలూ కీర్తికిరీటం లో కలికితురాయి. ఇప్పటివరకూ ఈ అవార్డును వహీదారెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజాలు మాత్రమే అందుకున్నారు.బాలూ ఈ పురస్కారాన్ని పొందిన నాలుగోవ్యక్తిమాత్రమే కాదు తొలితెలుగువ్యక్తికూడా.
నటుడిగా ప్రభుదేవా,నాగార్జున,వెంకటేష్ లకి తండ్రిపాత్రలో కనిపించి భరణి మిధునం సినిమాలో విలక్షణమైన నటననలో జీవించారు బాలూ..

MUST READ :ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే… బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజ్‌లు

అథ్యధికపాటలుపాడిన గాయకుడిగా Guinness World Record ని సొంతం చేసుకున్నారు బాలు..
నెల్లూరుజిల్లా కోనేటమ్మపేట(ఇప్పుడు తమిళనాడు లో ఉంది)లో ప్రముఖహరికధాకళాకారుడు సాంబమూర్తి,శకుంతల గార్లకి జూన్ 4,1946 న పుట్టిన ఈ ‘బాలు’ గాంధర్వుడు.. పాటలు పాడటం మొదలుపెట్టి డిసెంబర్ 15 ,2016 కి “50” సంవత్సరాలు అయ్యింది ..

ప్రపంచం మొత్తం మీద అభిమానులని, ఆత్మీయులని సంపాదించుకున్న బాలూ స్వరం నిత్యనూతనం..మరిన్ని పాటలతో సంగీతాభిమానులని అలరించాలనికోరుకుంటూ స్వరరారాజు,గానగంధర్వుడు, శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ శ్రీపతిపండితారాధ్యులబాలసుబ్రహ్మణ్యం

MUST READ :కుజ దోష, సంతాన దోష, కాలసర్పదోష, రోగ నివారణ క్షేత్రం “హేమాచల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం”


  •  
  •  
  •  
error: Content is protected !!

x

Related Posts

రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం?
ri Guru Raghavendra Swamy Miracles || రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం? MUST READ:అవతారం అనగా-నేమి-?దాని-ప్రయోజనం ఏంటి ?చాగంటి గారి మాటలలో....
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....*
    *నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....* 🕉ఓం నమో వెంకటేశాయ🕉 *‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో డాక్యు...
వీళ్లి ద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా?
  Actor Raghuvaran With His Wife Rohini | వీళ్లిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా? | MUST READ:ఇన్ని నదులు వుండగా గంగ నది కే ఎందుకు అంత...
powered by RelatedPosts